Logo
Date of Publish : 05 June 2022, 3:58 pm
Editor : Sake Naresh

బిజెపి – జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలి : తిరుపతి జనసేన నాయకులు

     తిరుపతి, (జనస్వరం) : తిరుపతి పట్టణంలో మీడియా సమావేశంలో జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు బాబ్జి, సుభాషిని, కీర్తన, ఆనంద్, సుమన్ బాబు, పార్ధు, చరణ్, సుజిత్, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ లు మాట్లాడుతూ ఒక్క రాత్రిలో రాష్ట్ర రాజకీయ చర్చలు మారిపోయాయి అని, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా  రేపు ఎల్లుండి రెండు రోజులు ఏపీలో పర్యటించనున్న సందర్భంగా బిజెపి, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని దీన్ని డిమాండ్ లేదా మా అభ్యర్థన అయినా అనుకోవచచ్చు అని అన్నారు. రాష్ట్ర స్థాయి కాదు ఢిల్లీ స్థాయి వ్యక్తులు ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నాయకులు, జనసైనికులతో పాటు ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని, ఈ రెండు రోజల పర్యటనలో నడ్డా ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలని కోరారు. నాడు 2014 ఏపీ ప్రచారంలో భాగంగా మోడీ పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర బిజెపి నాయకులు పువ్వులో పెట్టుకొని చూసుకోవాలి అని అన్నారు. మరి పువ్వులో పెట్టి చూసుకుంటారో, లేక పువ్వులే పెడతారో మీ ఇష్టం అని వాపోయారు. రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పరిపాలనలో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు  నేటి రాష్ట్ర రాజకీయాల పట్ల ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులను గమనించి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవస్య కథ ఎంతైనా ఉంది అని బిజెపి రాష్ట్ర, జిల్లా కమిటీ జాతీయ అధ్యక్షులుకి మా విన్నపం ఒక్కటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com