
దేశానికి ప్రజలకి మేలు చేసే విషయంలో పదిమందికి స్ఫూర్తి నింపడంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరువాతనే ఎవరైనా అని జనసేన నాయకులు అన్నారు. కార్యకర్తల బలం ఉన్నా ఆయనే మొదటి అడుగు వేసి అందరిలో స్ఫూర్తి నింపుతారు. ఆ స్ఫూర్తి తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా NRI శ్రీ మూసూరు గంగాధర్ గారు కరోనా కష్ట కాలంలో విశాఖ జిల్లా బౌన్సర్ కుటుంబాలకు నిత్యావసర సరుకులు శివప్రసాద్ గారు మరియు ధర్మేంద్ర గారి ఆధ్వర్యములో అందచెయ్యడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఖండాంతరాలు దాటినా జనసైనికులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జనసేవ స్ఫూర్తిని మర్చిపోవడం లేదు. ఉద్యోగరీత్యా చాలా మంది విదేశాలకు వెళ్ళడం పరిపాటి. అక్కడి పరిస్థితులని, ఉద్యోగ ఒత్తిళ్లను తట్టుకొని జనసేన సిద్దాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పాటు పడడం నిజంగా గొప్ప విషయం. తమకున్న కొద్దిపాటి సమయాన్ని కూడా తమ మాతృభూమి అయిన తెలుగు రాష్ట్రాల మీద మమకారంతో తమ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ జనసేన పార్టీ ద్వారా తమ సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.