న్యూస్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జి వినుత కోటా గారు భర్త కోటా చంద్రబాబు గారు హైదరాబాద్ లో ప్రత్యేకంగా కలవడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం , చిందేపల్లి గ్రామస్తులు తమ ఊరికి వెళ్ళే ఆర్ అండ్ బి రహదారిని ఈసీఎల్ సంస్థ మూసివేసిందని పవన్ కళ్యాణ్ గారితో గ్రామస్థులు వినుత గారితో సమావేశంలో పాల్గొని తెలియజేశారు. ఈ రోడ్డు కోసం జనసేన చేపట్టిన పోరాటం, పోలీసు కేసులు తదితర పరిణామాలను సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా వీడియోలు చూసి తెలుసుకున్నారు. గ్రామస్తులకు అండగా ఉంటామని న్యాయం కోసం నిలబడతామని, త్వరలో చిందే పల్లి గ్రామానికి వస్తానని పవన్ కళ్యాణ్ గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. అనంతరం వినుత కోటా గారు, భర్త కోటా చంద్రబాబు గారితో ప్రత్యేకంగా సమావేశమై 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా నియోజవర్గంలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలను , ప్రజల సమస్యల పై చేస్తున్న పోరాటాలను, అధికార పార్టీ వినుత కోటాపై ఇదివరకే పెట్టిన అనేక అక్రమ కేసుల గురించి, పలు మార్లు వారిపై చేసిన దాడుల గురించి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. నియోజకవర్గం లో వినుత గారు బలంగా చేస్తున్న పోరాటాలను అభినందించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఈ క్రూరమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా నియోజకవర్గంలో పార్టీ గెలవడానికి ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించి అనేక సలహాలు, సూచనలు వినుత గారికి భర్త కోటా చంద్రబాబు గారికి అధినేత తెలియజేశారు. బలంగా పోరాట స్ఫూర్తిని కొనసాగించి ప్రజలకి అండగా నిలబడాలని, పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు బరోసా ఇచ్చారు. అధినేత ఇచ్చిన అన్ని సూచనలు, సలహాలు పాటించి రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా మరింత ఉస్తాహంతో ముందుకు వెళతామని వినుత గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. చిందేపల్లి రోడ్డు సమస్యలో అక్రమ కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన జనసైనికులను, గ్రామస్తులను పవన్ కళ్యాణ్ గారు కలిసి భరోసా, ధైర్యం ఇచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com