Logo
Date of Publish : 14 December 2022, 2:51 pm
Editor : Sake Naresh

ఇచ్చిన మాట నిలుపుకున్న పవన్ కళ్యాణ్ గారు : హలీమ

          ధర్మవరం ( జనస్వరం ) : కౌలు రైతులు భరోసా యాత్రలో భాగంగా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఉమ్మడి అనంతపూరం జిల్లాకు గతంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చారు. ధర్మవరం నియోజకవర్గం గొట్లురు గ్రామంలో మైనారిటీ కుటుంబానికి చెందిన నిట్టూరు బాబు ఆత్మహత్య చేసుకోవడం వల్ల వారి కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి నిట్టూరు బాబు కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుంటున్నప్పుడు బాబూ పెద్ద కూతురు హలీమ భవిష్యత్తులో కెరియర్ పరంగా మీరు ఏం జాబ్ చేయాలనుకున్నారు అని అడిగారు. దానికి హలీమ నేను S.I కావాలనుకున్నాను సార్ ఇదే నా కల అని చెప్పారు. తప్పకుండా జనసేన పార్టీ మీరు S.I అయ్యేందుకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని మాట ఇచ్చారు. అందులో భాగంగా ప్రస్తుతం S.I పోస్ట్ నోటిఫికేషన్స్ పడడంతో హలీమ మంచి కోచింగ్ సెంటర్ లో అలాగే అక్కడ మంచి హాస్టల్లో చేర్పించి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే, ఫిజికల్ టెస్ట్, ఆ తర్వాత మైన్స్ ఎగ్జామ్ దాకా మొత్తం ఖర్చులన్నీ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ భరిస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. చెప్పిన మాట ప్రకారం చేస్తున్నందుకు హలీమ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగాల ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com