Logo
Date of Publish : 08 May 2023, 3:23 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ సిఎం కావాలి – ప్రజల సమస్యలు తీరాలి : మైఫోర్స్ మహేష్

        మదనపల్లి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, మదనపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ ప్రకటించారు. ఆదివారం మదనపల్లె రూరల్ మండలం బోడుమల్లదిన్నె లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మైఫోర్స్ మహేష్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ ఆద్వర్యంలో మదనపల్లె నుండి బోడుమల్లదిన్నె వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని యువత, జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ కు ఘనంగా స్వాగతం పలికారు. ‌జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసైనికులు పవన్ కళ్యాణ్ సిఎం కావాలని, మైఫోర్స్ మహేష్ ఎమ్మెల్యే కావాలంటూ నినాదాలు చేశారు. 60 రోజులు పాటు జనం కోసం జనసేన కార్యక్రమం మదనపల్లె నియోజకవర్గం నిర్వహించడం జరిగిందని వివరించారు. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ రాష్ట్రంలో విజయ డంకా‌ మ్రోగిస్తుందని, మదనపల్లెలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని అన్నారు.‌ రాష్ట్రంలో జనసేన పార్టీకి ప్రజల నుండి గొప్ప ఆదరణ లభిస్తోందని, అత్యధికంగా ఎమ్మెల్యేలు గెలిచి పవన్ కళ్యాణ్ సిఎం కావడం తధ్యం అన్నారు.‌ అనంతరం ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ సిద్దాంతాలను తెలియజేసి రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ, జనసేన నాయకులు సందీప్, శంకర్, మల్లిక, సుప్రజ, సునీత, నరేష్, మనోజ్, నాగేంద్ర, సోను, హర్ష, షబ్బీర్, సల్మాన్, షామీర్, చాన్, ఆయాజ్, జాఫర్, పాల్గొన్నారు. ‌


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com