Logo
Date of Publish : 23 December 2022, 11:49 am
Editor : Sake Naresh

రాష్ట్రంలో రైతుల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

• విజయనగరం నియోజకవర్గం, గుంకలాం గ్రామంలో రైతు దినోత్సవ వేడుకలు

• రైతులను సత్కరించిన జనసేన నాయకులు

• జనసేన రైతుభరోసా యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ చేసే సేవలను రైతులకు వివరించారు.

       విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవంను పురస్కరించుకొని, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గుంకలాం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతులతో ముందుగా నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తన బంగారు జీవితాన్ని మన బడుగు, బలహీన,అణగారిన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, రాష్ట్రంలో రైతుల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ప్రభుత్వం చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వట్లేదని,రైతులకు సరియైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని, ఎరువులు, విత్తనాలు రైతులకు సరియైన సమయంలో ఇవ్వడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని,కనీసం పంటపొలాలకు ఇస్తామన్న ఉచిత విద్యుత్ కూడా అందించలేక పోతున్నారని,రైతు లేనిదే ప్రభుత్వం లేదని ప్రగద్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని కొనాల్లోను విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర పేరుతో చనిపోయిన కౌలురైతు కుటుంబాలను పరామర్శించి, ప్రతీ ఒక్క కుటుంబానికి లక్ష రూపాయల చప్పున ఇస్తూ, ఆ కుటుంబంలో ఉన్న పిల్లల భవిష్యత్ కోసం, చదువులకోసం ప్రత్యేకమైన నిధిని కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, పవన్ కళ్యాణ్ రైతులకోసం చేస్తున్న పలు సేవలను వివరించారు. జనసేన నాయకులు వంక నరసింగరావు మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, అటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ తన సొంత కష్టార్జితాన్ని రైతులకు సహాయం చేస్తున్న ఆపద్భాదవుడు అని కొనియాడారు. అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా రైతులకు జనసేనపార్టీ నాయకులు లాలిసెట్టి రవితేజ, లోపింటి కళ్యాణ్, ఫిరోజ్ , భాస్కర్ సత్కరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com