Logo
Date of Publish : 24 June 2023, 5:55 pm
Editor : Sake Naresh

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్

           విజయనగరం ( జనస్వరం ) : అన్ని కులాలను కలుపుకొని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ పై అవాకులు, చవాకులు వాగుతుంటే సహించేది లేదని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు హెచ్చరించారు. దీనిపై శనివారం ఉదయం ఆయన కార్యాలయంలో మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదకాపులు,చినకాపులు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారయణ, ముద్రగడ పద్మనాభం కు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అక్రమాలు,దారుణాలు, అన్యాయాలు తెలియ లేదా అని ప్రశ్నించారు. కేవలం ఉద్యమం పేరుతో మీరు సాధించింది శూన్యమని, జగన్ వద్ద మెప్పు కోసం, పదవులకోసం, పవన్ కళ్యాణ్ ను లక్షంగా చేసుకొని నోటికి వచ్చినట్లు వాగుతున్నారని, ఇటువంటి చులకన రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మరో సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టగానే వైఎస్సార్సీపీ నాయకులు పేర్ని నాని, బొత్స సత్యనారయణ, ముద్రగడ పద్మనాభం వంటి చాలా మంది పవన్ కళ్యాణ్ పై దుర్భాషులాడుతూ విరుచుకు పడుతున్నారని, బొత్స సత్యనారయణ ఐతే ఏకంగా పవన్ కళ్యాణ్ గూండా అని, జనసైనుకులు రౌడీలు అని నోటికి వచ్చినట్లు పేలుతున్నారని, ఆ మాటలను జనసేన తరుపున ఖండిస్తూ, ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటీని మరచి, ప్రజా పాలనను ఏకంగా మరుగున పడేసారని అన్నారు. ఈ వైసీపి నాయకులు ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఒక్క ఎమ్మెల్యే, ఎంపి లేని జనసేన పార్టీ ను చూసి ఇలా వాగుతున్నారంటే.. కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు, పార్టీకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీ నాయకులకు తగిన విధంగా గుణపాఠం, సమాధానం దొరుకుతుందని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com