గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : తూగుండ్రం గ్రామంలో, జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. అధికారంలో లేకుండానే కొట్లాది రూపాయల తన సంపాదనను ఈ దేశానికి ఇస్తుంటే, అధికారంలోకొస్తే పవన్ కళ్యాణ్ చేసే సేవలు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ప్రజల ఆలోచించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేదీప్యమానంగా వెలగడం ఖాయమని తెలియజేశారు. ప్రజా సంక్షేమ పాలన రాగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నియోజకవర్గాల తరువాత గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి మూడవ ప్రాధాన్యత తీసుకొస్తామని, ఈ నియోజకవర్గాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేసారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణస్వామి నియోజకవర్గంలో చేసింది శూన్యమని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసి సాధించు కున్నామని, ప్రజలకు అండగా నిలబడ్డామని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అండగా నిలబడేది జనసేన మాత్రమేనని తెలిపారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి సవాల్ విస్తృతనన్నారు. నీ మేనల్లుడు నిన్ను అవినీతిపరుడని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తే, దానిమీద ప్రతిస్పందనగా నువ్వు అవినీతిపరుడవైతే నీ మేనల్లుడు మీద కేసు పెట్టవు, నువ్వు నిజాయితీపరుడవైతే, సత్యమార్గాన్ని అనుసరిస్తున్న వాడవు అయితే, సత్యవంతుడవైతే రెండు రోజుల్లో నీ మేనల్లుడు మీద కేసు పెట్టాలని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి రెండు రోజులు సమయం ఇస్తున్నా, నీ నిజాయితీ నిరూపించుకోమని ఎద్దేవా చేశారు. తూగుండ్రం హెచ్ డబ్ల్యు లో నీటి సరఫరా సరిగా లేనందువల్ల, మహిళలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే పైపులైన్ వేసి నీరు అందుబాటులోకి తేవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. గ్రామంలో మురుగినీటి వ్యవస్థ కూడా సరిగా లేదని, ఎక్కడికక్కడ మురుగునీరు మగ్గి పోయి అనారోగ్యపు స్థితిలోకి గ్రామం నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే చక్కని మురుగునీటి వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, మండల బూత్ కన్వీనర్ తులసీరామ్, మండల ఉపాధ్యక్షులు రషీద్, మండల ప్రధాన కార్యదర్శి దాము, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి రుద్ర,, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ యువజన కార్యదర్శి అన్నామలై, కోదండన్, పాలసముద్రం మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షులు రాఘవ, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, యతీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com