● పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 144వ రోజున 49వ డివిజన్ ఈద్గామిట్ట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గడచిన ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థాపించాక ముస్లింలకు ఎలా అన్యాయం చేస్తున్నారో ప్రతిఒక్కరికి అవగతమవుతోందని అన్నారు. దుల్హన్ పథకం, విదేశీ విద్య, హజ్ యాత్ర సాయం, ట్రాన్సలేటర్ ఉద్యోగాలు విడుదల చేయకపోవడం వంటి వాటి నుండి ఆఖరికి చిన్నపిల్లలకు ఖత్నా (ఒడుగులు తీసే కార్యక్రమం) చేయించలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. వక్ఫ్ బోర్డు ఆస్తులకు కూడా వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో అనేకచోట్ల ఈ ఆస్తులకు సంబంధించి అశాంతి నెలకొందని కేతంరెడ్డి పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు నిజమైన నేస్తం పవన్ కళ్యాణ్ గారే అని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులకు అండగా నిలిచి లబ్ధి చేకూరుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.