Logo
Date of Publish : 24 February 2021, 8:45 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా రాజకీయాల్లోకి యువత : భీశెట్టి వసంత లక్ష్మి గోపి కృష్ణ

               యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజకృషి మేలుకు కృషి చేయాలని ఆశించి ప్రోత్సహించే పవన్ కళ్యాణ్ స్పూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాక్షేత్రంలో సేవ చేసేందుకు ముందుకు వచ్చానని 33వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థిని భీశెట్టి వసంత లక్ష్మి గోపి కృష్ణ పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థినిగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన వసంత లక్ష్మి గోపి కృష్ణ 33 వ వార్డులో మహిళలకు బొట్టు పెట్టి తనని గెలిపించాలని కోరారు. చదువుకున్న యువతిగా వార్డు ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు. ఏప్రిల్ నుంచి పెరగబోయే ఇంటి పన్నులను కౌన్సిలలో అడ్డుకుంటానని అన్నారు. సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఉండిపోయిన 1450 సర్వే నెంబర్ భూమి రిజిస్ట్రేషన్ సమస్య తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. వార్డులో పేద పది, ఇంటర్ విద్యార్థులకు స్కాలర్ షిప్ వచ్చేలా చేస్తామని అన్నారు. యువత కోసం వ్యాయామశాల, ఆరోగ్యం కోసం యోగా ధ్యానం ఉచిత శిక్షణలు ఇచ్చేలా చూస్తామని అన్నారు .      


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com