ఆళ్లగడ్డ, (జనస్వరం) : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం పర్యటన భాగంగా జరిగిన సంఘటనలు మరియు పరిణామాలు ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని, గత రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ ని గుజరాత్ రాష్ట్రం నెంబర్ ప్లేట్ తో ఒక కారు, ఏపీ రెడ్డి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద ఒక కారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించడం పవన్ కళ్యాణ్ హత్యకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలే లేకుండా చేయాలని ఆలోచన రావడం వాళ్ళ ఓటమికి నిదర్శనం అని చేతనైతే దమ్ముంటే 2024 ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవాలి కానీ ఆయనను హత్యకు 250 కోట్లు డీల్ కుదుర్చుకోవడం చేతగాని దద్దమ్మలపనేని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే కొన్ని కోట్ల మంది జనసైనికులను దాటి వెళ్లాలని, ఆయనకు చిన్నపాటి ప్రాణహాని కలిగించిన వైసీపీలో ఏ నాయకుడు భూమి మీద ఉండడని ఆంధ్రప్రదేశ్ రావణ కాస్తంలో తగలబడుతుందని హెచ్చరించారు. ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం సన్నగిల్లుతుందని పవన్ కళ్యాణ్ కి ప్రాణం ఆయనకు ముఖ్యమో కాదో తెలియదు కానీ, కోట్లాది మంది అట్టడుగు పేద, బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యమని, మన రాష్ట్రానికి ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, దయచేసి పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ (Z+) కేటగిరి భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర హోమ్ శాఖ అమిత్ షాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమ్మరి నాగేంద్ర, రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, బావికాడి గుర్రప్ప, చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.