• పాలన అంతా పరదాల చాటున పోలీసుల మాటున సాగుతుంది.
• రాష్ట్రానికి నీలి గ్రహణం పట్టుకుంది.
• ఈ రాష్ట్రానికి దుష్ట చతుష్టయం సీఎం జగన్, సజ్జల, వైవీ, విజయ సాయి
• ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వనన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అధికారం పోతుందనే భయం సీఎం జగన్ కి పట్టుకుంది
• సీఎం జగన్ సతీ సమేతంగా ఏనాడైనా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారా?
విజయవాడ, (జనస్వరం) : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ ఫోబియో పట్టుకుందని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ ఫోబియో పట్టుకుందని అందుకనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారని, సీఎం జగన్ కి తన పాలనపై నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎందుకని పవన్ కళ్యాణ్ వైసిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వమని మాట్లాడుతూ ఉండడం వల్లే జగన్ కి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయం పట్టుకుందని అందుకే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని అదేవిధంగా దమ్ము ధైర్యం గురించి మాట్లాడే సీఎం జగన్ పరదాల మాటన పోలీసుల చాటున ఎందుకు పాలన సాగిస్తున్నారో సమాధానం చెప్పాలని, ఈ రాష్ట్రానికి నీలి గ్రహణం పట్టిందని, ఈ రాష్ట్రాన్ని ఆలీబాబా 150 డెకాయిట్లు పాలన చేస్తున్నారని ఈ రాష్ట్రానికి పట్టిన దుష్ట చతుష్టయం సీఎం జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి వై వి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి లేనని, నవరత్నాల పథకాల వల్ల ఒక్క పేద జీవితం కూడా అభివృద్ధి చెందలేదని సంక్షేమ పాలన ముసుగులో రాష్ట్రంలోని సంపద అంతా దోచుకుంటున్నారని సీఎం జగన్ కి కానీ వైసీపీ నాయకులు కానికి దమ్ముంటే నవరత్నాల పథకాల వల్ల రాష్ట్రంలో సామాన్యులు ఎవరైనా ఉన్నతంగా ఎదిగిన ఉదాహరణలు చూపించాలని సవాల్ విసిరారు. సీఎం జగన్ ఏనాడు అంబేద్కర్ కి జగ్జీవన్ రామ్ కి పూలే విగ్రహాలకు నివాళులర్పించలేదని కేవలం రాజశేఖర్ రెడ్డి కి మాత్రమే నివాళులర్పిస్తారని, అంబేద్కర్ జగ్జీవన్ రామ్ పూలె జయంతి వర్ధంతి కేవలం క్యాంప్ ఆఫీసులో ఒక చిత్రపటానికి మాత్రమే పూలమాలలు వేస్తారని ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలని, అదేవిధంగా సీఎం జగన్ గారు తాను క్రైస్తవానికి చెందిన వ్యక్తినని ప్రకటించుకుంటారు కానీ ఏనాడు సతి సమేతంగా చర్చ్ కు వెళ్లి ప్రార్థన చేసిన దాఖలాలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పవర్ సెంటర్ అవుతున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పదేపదే విమర్శలు చేస్తున్నారని విమర్శలు మాని అవినీతిని పూర్తిగా తగ్గించుకొని మంచి పాలన అందించడంపై దృష్టి సారించాలన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com