
మంత్రాలయం, (జనస్వరం) : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి పిల్లల చదువులకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరోసా ఇచ్చారని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ బి. లక్ష్మన్న తెలిపారు. శుక్రవారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్ నాలుగు మండలాల నాయకులతో కలిసి రాజా మైలవరపు ఆధ్వర్యంలో రూపొందించిన టీం పిడికిలి గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదాయం ఉన్న సినిమా రంగాన్ని వదలి ప్రజా సంక్షేమం కోసం పార్టీ స్థాపించారని కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించిన నేపథ్యంలో సొంత డబ్బుతో ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందించి ఆదుకుంటున్నారని కొనియాడారు. వైసిపి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జిల్లాలో 373 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించి మృతి చెందిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారని రానున్న రోజుల్లో మరిన్ని కుటుంబాలను కలవమన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల నాయకులు ఏసేబు, బిబిసి చిన్న, టిపి రఘు, కౌతాళం మండల నాయకులు రామాంజనేయులు, బసవరాజు, ఆంజనేయులు, పెద్దకడబూరు మండల నాయకులు గణేష్, రాజు, కోసిగి మండల నాయకులు వీరారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.