జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించాడు అనే విషయం విశ్వవ్యాప్తంగా ప్రచారం సాగింది, ఇంకా ఆ ప్రచారం కొనసాగుతూనే ఉంది. అసలు అందులో నిజనిజాలు ఏంటి క్లుప్తంగా తెలుసుకుందాం...
పవన్ కళ్యాణ్ గారి జానీ మూవీ విడుదల అయ్యి సినిమా ప్రేక్షకులను నిరుత్సాహా పరిచిన రోజులు అవి. అదే సమయంలో పరిటాల రవి అనంతపురం జిల్లాలోని పెనుగొండ శాసన సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ సమయంలో ఒకరూ సినిమా రంగంలో, మరొకరు రాజకీయ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కొంతమంది కావాలని ఈ ఇద్దరిమధ్య సమస్యలు సృష్టించి పెద్దది చేయాలని భావించారు. అలా ఒక భూమి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి పరిటాల రవి గుండు కొట్టించాడని అసత్య ప్రచారాలు చేసి ప్రజలని నమ్మించారు...
అసలైన వాస్తవాలు తెలుసుకుందాం....
1. ఖాదర్ మొహీద్దీన్ అనే రచయిత పరిటాలవి గారి జీవిత చరిత్ర గురించి ఒక " అస్తమించని రవి " ( ఒక ఉద్యమ వీరుడి ఊపిరి యాత్ర ) అనే పుస్తకం రచించారు. అందులో చాలా వివరంగా పవన్ కళ్యాణ్ గారికి, పరిటాల రవికి ఏమాత్రం సంబంధం లేదని, వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కలుసుకోలేదని వివరించారు. గుండు కొట్టించడం అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టి పారేశారు.
పుస్తకంలోని సాక్ష్యాలను తెలిపే పేజీలు :
ఇదే పుస్తకాన్ని మొత్తం మీరు అంతర్జాలంలో చదవచ్చు : Book file D౦wnload Here
2. పరిటాల రవి గారు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఛానల్ వారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ప్రసాద్ ల్యాబ్ లో ఒకసారి చూశాను. ఆ తర్వాత తనని ఎపుడూ కూడా కలవలేదు. ల్యాండ్ విషయమై నేను చిరంజీవి గారితో గొడవపడటం, పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించడం అవన్నీ అవాస్తవాలు అని కొట్టి పారేశారు.
అందుకు గల సాక్ష్యం :
3. పవన్ కళ్యాణ్ గారు తన మీద నిరాపరాధమైన రాతల్ని రాసిన డెక్కన్ క్రొనికల్ ( Deccan Chronicle ) ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. తన మీద వచ్చిన అసత్యాల్ని ఖండించారు.
డెక్కన్ క్రొనికల్ ( Deccan Chronicle ) ఆఫీసు ఎదుట ధర్నా చేసిన ఫోటోలు :
4. పవన్ కళ్యాణ్ గారు 2004 లో ఒక పత్రికా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ డెక్కన్ క్రొనికల్ ( Deccan Chronicle ) ఆఫీసు ఎదుట ధర్నా, పరిటాల రవికి తన మధ్య ఉన్న వాస్తవాలను క్లియర్ గా చెప్పారు. తన మీద వచ్చిన వార్తలను ఖండించారు.
ఆ పత్రికా ఛానల్ యొక్క ఇంటర్వ్యూ పేపర్ క్లిప్స్ :
5. పరిటాల రవి భార్య పరిటాల సునీత గారు మీడియా ఎదుట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి, మాకు ఎటువంటి పరిచయాలు లేవని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ రోజే మాభర్త క్లియర్ గా చెప్పారని మరోసారి గుర్తు చేశారు.
వీడియో :
[video width="1280" height="680" mp4="https://janaswaram.com/wp-content/uploads/2022/02/KLHk9lK9ylQSowMB.mp4"][/video]
6. పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు అయిన వల్లభనేని వంశీ కొన్ని మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కళ్యాణ్ గారికి, పరిటాల రవికి పరిచయమే లేదని చెప్పారు. కేవలం కొందరు అసత్య ప్రచారాలు చేయడం వల్ల అది ప్రజలలో ఆ విషయం ఇంకా నానుతోందని అన్నారు.
వీడియోలు :
[video width="1192" height="720" mp4="https://janaswaram.com/wp-content/uploads/2022/02/IeshfWE91vPDg6f5.mp4"][/video]
[video width="1032" height="720" mp4="https://janaswaram.com/wp-content/uploads/2022/02/X8kr7DxKxYKWCkhR.mp4"][/video]
[video width="1280" height="648" mp4="https://janaswaram.com/wp-content/uploads/2022/02/nINufsoFF4RzpZkp.mp4"][/video]
7. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలలో స్పందిస్తూ అసలు నాకు పరిటాల రవి పరిచయం కూడా లేదు. కేవలం కొందరి వ్యక్తుల సమూహం వల్ల అసత్యాలను నిజాలని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పారు.
వీడియోలు :
[video width="1280" height="564" mp4="https://janaswaram.com/wp-content/uploads/2022/02/NGCgSTN-rk7PNumU.mp4"][/video]
[video width="1280" height="720" mp4="https://janaswaram.com/wp-content/uploads/2022/02/Oru2lQPNBuBVmX9T.mp4"][/video]
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com