
ఏలూరు ( జనస్వరం ) : ఏలూరు, (జనస్వరం) : వైసీపీ వచ్చే ఎన్నికల తర్వాత తట్టా, బుట్టా సర్దేయడమే అని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయడు హెచ్చరించారు. యువశక్తి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వై.సి.పి మంత్రులు మూకుమ్మడి మాటల దాడి చేయడంపై జనసేనికులు మండిపడుతున్నారు.తమ అధినేత పవన్ అంటే వైసీపీ భయపడుతోందని, చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిస్తేనే వైసీపీ నేతల ప్యాంటు తడి చిపోయాయని ఇక కలిసి పోటీ చేస్తే ఇక రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో పవన్ కల్యాన్ ను టార్గెట్ చేశారని జనసేన విమర్శిస్తోంది. మంత్రుల ఎదురుదాడిపై పీఏసీ మెంబర్ నాగబాబు ట్విటర్ జనసేన వేదికగా ట్వీట్ ను ప్రశంసించారు. వైసీపీ మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలు పెట్టారు, వాయినాలు ఇచ్చి పంపండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక సభ పెట్టి విమర్శలు చేస్తే ఏకంగా మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం వెనుక ఉద్దేశం అదేనన్నారు. వైసీపీ ఇక తమ ప్రత్యర్థి పవన్ కల్యాణ్ భావిస్తోందా..? అంటే అవుననే సమాధానం జనసేన నుండి వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్. కల్యాణ్ బయటకు వచ్చి ఏ పర్యటన చేసినా వైసీపీ మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా మాటల దాడి చేస్తున్నారని, అంతేకాదు యువశక్తి బహిరంగ సభలలో అయితే ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావనే లేకుండా పవన్ కల్యాణ్ ప్రసంగమే లేదన్నారు. దీంతో పవన్ కల్యాణ్ తమ రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ భావిస్తుందన్నారు. అంతే కాదు భవిష్యత్లో వైసీపీని బలంగా ఢీకొట్టే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఆన్నారు.