కాకినాడ రూరల్ ( జనస్వరం ) : కరప మండలం ఉప్పలంక గ్రామం లో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు సంగాడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీగారు.. ఈ గ్రామం లో పర్యటన చేస్తున్న నానాజీగారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు గాని ఇళ్ల స్థలాలు చూపించ లేదని, మత్స్యకార గ్రామం అయినప్పటికీ చాలా మందికి సబ్సిడీ లోన్లు లేవు, వలలు, డిజిల్, బోట్లు, ఇంజన్లు ఇవ్వలేదని అన్నారు. స్మశాన వాటిక లేదని, ప్రజలు పంచాయతీ అధికారులకి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని, తదేకం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వైసీపీ నాయకులు అడ్డుపెట్టేరని, EDC భవనం చుట్టూ తుప్పలు పెరిగిపోయి ఉపయోగం లేకుండా ఉందని అన్నారు. పారిశుధ్య సమస్యలు అధికంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని, నీరు నిండిపోతున్నా పంచాయతీ వాళ్లు పట్టించుకోవడం లేదని, పందుల బెడదా ఎక్కువగా ఉందని అన్నారు. గ్రామం లో రేవు ఉంది కానీ తెప్పలు వెళ్లే దారిలో రెండూవైపులా చెట్లు పెరిగి పోయి దారి మూసుకుపోయిందని, కమ్యూనిటీ హాల్ కి వెళ్లే దారి చాలా దారుణంగా ఉందని, రోడ్లు సరిగా లేవని అన్నారు. వీధి లైట్లు, చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని, వివాహాలు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ లేదని పిల్లలు ఆదుకోవడానికి పార్క్, విద్యార్థులకి గ్రంధాలయం లేదన్నారు. అంగన్వాడీ బిల్డింగ్ లో వర్షం వచ్చినప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు నానాజీగారికి విన్నవించారు. ఈ సమస్యలపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళతమని, వారు చేయని పక్షంలో జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు పూర్తి చేద్దామని గ్రామస్తులకి తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన నాయకులు, రాష్ట్ర, జిల్లా స్థాయి, మరియు కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, అర్బన్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.