Logo
Date of Publish : 27 January 2024, 10:09 pm
Editor : Sake Naresh

కాకినాడలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమం

    కాకినాడ ( జనస్వరం ) : కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం యండమూరు గ్రామంలోని వడ్డీపాలెం ప్రాంతంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన నాయకులు గంజా దుర్గా ప్రసాద్, కుక్కల మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేశారు. జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమస్యల గురించి తెలుసుకున్నారు.  ప్రజలు వారి సమస్యలను విన్నవించారు. వడ్డీపాలెంలో సరైన రహదారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వడ్డీపాలెం నుండీ వేళంగికి వెళ్లే ఏటిగట్టు రోడ్డు కి శంకుస్థాపన చేసి వదిలి పెట్టేసారు. ఎన్ని సార్లు చెప్పిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను వాకాడ గ్రామానికి మల్లించి ఇక్కడ పనులు నిలిపివేసిన వైసీపీ ఎమ్మెల్యే.  స్థానికులకు ఉపాధి లేక దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామం అంత ఖాళీగా ఉంది. ఆరోగ్య శ్రీ కార్డులు పనిచేయక పోవడం తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, మంచి నీరు ట్యాంక్ శుభ్రం చేయడం లేదు అని ఇలా అనేక సమస్యలు తెలిపారు... త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన వడ్డీపాలెం యువత మరియు టీడీపీ నాయకులు పిల్లి శ్రీను, పిల్లి రమేష్, గుబ్బల అప్పారావు, మేడిశెట్టి భద్రరావు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com