
ఆత్మకూరు, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం నేటితో 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ,త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి రథంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా యాత్ర చేయడం జరుగుతుందని, ప్రజలందరి ఆశీస్సులతో 2024 లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజా యాత్రను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పన్నాగం పన్నుతున్నాయని,వారి అభిలాష ఎప్పటికీ నెరవేరదన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పెద్ద మసీద్ సెంటర్, టెక్కే ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ, నాగరాజు, భాను, హజరత్, తదితరులు పాల్గొన్నారు.