Logo
Date of Publish : 08 December 2021, 4:17 am
Editor : Sake Naresh

సర్పంచ్ అవినీతిని బట్ట బయలు చేసిన పాటూరు గ్రామ జనసైనికులు

         నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాటూరు గ్రామంలోని సర్పంచ్ అవినీతికి అడ్డుఅదుపూ లేకుండా పోయింది. సర్పంచ్ అవినీతిని బట్టబయలు చేసి పై అధికారులకు వినతి పత్రం అందించి చర్యలు తీసుకోమని జనసైనికులు వినతిపత్రం అందించారు.  వివరాల్లోకి వెళ్తే మొన్న వచ్చిన వరద నీరుతో  చేపలు దొరువులో వచ్చాయి. దొరువులో ఉన్న చేపలను అక్రమంగా స్థానిక వైస్సార్సీపీ నాయకులు మరియు సర్పంచ్ భర్త బైన సురేంద్ర తన బినామీలు ఐనట్టువంటి శ్రీధర్ రెడ్డికీ 10000 వేల రూపాయలకు ఆ గుంటను సర్పంచ్, వార్డు సభ్యులకు తెలియకుండా 20 రోజులకు లీజుకు ఇచ్చారు. కనీసం పంచాయతీ బోర్డ్ మీట్టింగ్ పెట్టకుండా తీర్మానం చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న జనసేన నాయకులు పంచాయతీకి వెళ్లి సమగ్ర విచారణ చేశారు. ఆ గుంటకు సంబంధించి చాలా అవకతవకలు జరిగిందని జనసేన నాయకులు తెలుసుకున్నారు. దాదాపు 6 లక్ష రూపాయల వరకూ దోచుకున్నట్టు విచారణలో తేలింది. పంచాయతీకి వెళ్లి పంచాయితీ కార్యదర్శిని నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై కనీసం సర్పంచ్ వివరణ కూడా ఇవ్వలేదు. స్థానిక వైస్సార్సీపీ నాయకులు పంచాయతీ కార్యాలయానికి వచ్చి పొరపాటు జరిగింది. మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. కానీ సర్పంచ్ భర్త అయిన బైన సురేంద్ర జనసేన నాయకులను దుర్భాషలాడి ఇష్టమొచ్చినట్టు అసభ్యపదజాలంతో నిందించాడు. మా పార్టీ, మా ప్రభుత్వం అంటూ మీరేవరూ ప్రశ్నించడానికి అంటూ జనసేన నాయకులను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ విషయంపై న్యాయపోరాటం చేయాలని జనసేన నాయకులు నిశ్చయించుకున్నారు. అలాగే పై అధికారులకు జరిగిన అవినీతి గురించి వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com