పత్తికొండ ( జనస్వరం ) : నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో విద్యా వైద్యం అభివృద్ధికి నోచుకోవడం లేదు అని ఆర్డిఓ గారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు CG రాజశేఖర్ మాట్లాడుతూ, పత్తికొండ టౌన్ నందు ప్రధానంగా మూడు సమస్యలున్నాయి,
1. విద్యలో భాగంగా ఆదర్శ పాఠశాలలో గత సంవత్సరం గణితం జువాలజీ బడిన తో పాటు కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన ఉపాధ్యాయులు లేరు అందువలన ఈ స్కూల్లో చదువుతున్న 700 మంది విద్యార్థులు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు, మరి కొందరు విద్యార్థులు చదువుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారు,
2. వైద్యం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం లేదు, ముఖ్యంగా పత్తికొండలో ముప్ప కొడుకుల ఆసుపత్రి కావడంతో చుట్టుపక్కల గ్రామాల వారి ఆస్పత్రికి వివిధ రకాల వైద్యం కోసం వస్తున్నారు, రాత్రి సమయంలో వైద్యులు లేక రోగులు అత్యవసర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా అత్యవసరం అయితే ఆదోని కర్నూలుకు తరలిస్తున్నారు, ఇక్కడ వైద్యం అందకం మార్గం మధ్యలో చాలామంది మరణిస్తున్నారు,
3. పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని తీసిన డ్రైనేజీ కలవ ద్వారా వివిధ షాపులు వారు ఇంటి లోపలికి వెళ్లే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువగా వృద్దులు చిన్నపిల్లలు రాత్రి సమయంలో కాళ్లు కింద పడి ప్రమాదాలు గురవుతున్నారు. ప్రస్తుతం పనులు జరగకపోవడంతో తీసిన కాలువ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం, పైన తెలిపిన సమస్యలను పరిష్కరించాలని లేని ఎడల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరం చేస్తామని తెలియజేస్తున్నాం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, చాంద్ భాష, వడ్డే విరేష్, ఎర్ర స్వామి, పులి శేఖర్, రామాంజనేయులు, శివకుమార్, రమేష్, వినోద్, హరి, మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com