పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున పత్తికొండ డిప్యూటీ తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన పత్తికొండ జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు C రాజశేఖర్ గారు మరియు జనసైనికులు. రాజశేఖర్ గారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటు వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న జర్నలిస్టు ఇవ్వాల్సిన అక్రిడేషన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు అలాగే కరోనా వైరస్ తో మృతి చెందిన జర్నలిస్టులకు 30 లక్షలు ఇవ్వాలి కరోనా బారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందించాలి. ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని హాస్పిటల్ నందు ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేయాలని హెల్త్ కార్డులు తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లుకు/కాలేజీ లెక్చరర్స్ కు, మరియు సిబ్బందికి ప్రభుత్వం సహాయం చేపట్టి వారికి 30 కేజీల బియ్యం, నెలకు 5000 వేల రూపాయలు కాలేజీలు,పాఠశాలలు తిరిగి తెరిచే వరకు ఈ సాయం అందించాలి. అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించి,.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, బాలింతలకు వారికి ఇచ్చే ఆహార కిట్టు ఇండ్లకు అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు నూరు భాష, సుధాకర్, ఇస్మాయిల్, తిమ్మప్ప,అంజి, అజయ్, రంగా, మరియు తదితరులు పాల్గొన్నారు.
వీటిని కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com