Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగుల క్యాలెండర్ పై నిరసన తెలిపిన పత్తికొండ జనసేన నాయకులు

పత్తికొండ

        పత్తికొండలో నాలుగు స్తంభాల గుడి దగ్గర జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు C రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగుల క్యాలెండర్ పై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు C రాజశేఖర్ మాట్లాడుతూ 18 తారీకున వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ లో జాబులు లేవు. కేవలం క్యాలెండర్ మాత్రమే కనిపిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 30 లక్షల పైగా నిరుద్యోగులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10146 జాబులు ఉన్నాయని ప్రకటించడం చాలా దుర్మార్గం అని అన్నారు. రోజు రోజుకు నిరుద్యోగ యువత పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు మాత్రం కల్పించడం లేదన్నారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదాలో ఉంటూ ఇంటింటికి జాబ్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. టిడిపి హయాంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఉద్యోగం కావాలంటే జగనన్న ప్రభుత్వం రావాలని పదే పదే సభలలోను, కార్యక్రమంలోను నిరుద్యోగ యువతని టార్గెట్ చేసుకొని చెప్పడం జరిగింది. ఈరోజు నిరుద్యోగ యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా పనిచేసిన నీలం సాహ్ని గారు రాష్ట్రంలో 24000 ఉద్యోగాలు ఉన్నాయని పత్రిక ప్రకటన చేయడం జరిగింది. నేడు మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారు 10,146 ఉద్యోగాలు కేటాయించడం చాలా దుర్మార్గం అని నిరుద్యోగులు నిరుద్యోగ తల్లిదండ్రులు బాధ పడుతున్నారు అని అన్నారు. అదేవిధంగా నాడు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి 907 పోస్టులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు 7740 ఉన్నాయ్ అని తెలియజేయడం జరిగింది. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ మోసం చేస్తుంది. గతంలో చెప్పిన లెక్కలకు ఏ మాత్రం పొంతన లేని ప్రస్తుతం నోటిఫికేషన్ ఎందుకంటే నేడు గ్రూప్ 1 గ్రూప్2 కు సంబంధించి 36 పోస్ట్లు వదలడం ఏ మాత్రం సబబు అని,  అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి 450 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ లో పేర్కొనడం చాలా దురదృష్టకరమని మిగిలిన పోస్టులు ఎక్కడ ?. జగన్మోహన్ రెడ్డి గారు  రాష్ట్రంలో 603756 జాబు లో ఇచ్చామని డప్పు కొట్టుకుంటున్నారు కానీ వాటిలో లో 259565 గ్రామ వార్డు వాలంటరీ ఉద్యోగాలు కల్పించారు కానీ వాటిని కూడా ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏ మాత్రం సబబు కాదు. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు మాకు శాలరీలు పెంచాలని కోరితే మీరు ఉద్యోగస్తులు కాదు మీరు స్వచ్ఛంద సేవకులుగా మాత్రమే అనిజగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు మంత్రులు అత్యంత పారదర్శకంగా అవినీతి విపక్షకు తావు లేకుండా జాబులు ఇచ్చామని అని పేర్కొనడం చాలా సిగ్గు చేటు. ఎందుకంటే ఇంతకుముందు సచివాలయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ 90 శాతం సచివాలయ ఉద్యోగాలు వైసిపి కార్యకర్తలకే ఇచ్చామని ఆయన మాటల్లోనే తెలియజేయడం జరిగింది. కానీ నేడు జగన్ మోహన్ రెడ్డి గారు ఎలాంటి విపక్ష పారదర్శకంగా అవినీతికి చోటు లేకుండా ఉద్యోగాల్లో ఇచ్చామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమా లేకుంటే విజయసాయిరెడ్డి గారు చెప్పేది నిజమా ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధమైతే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. విజయసాయి రెడ్డి గారు చెప్పింది నిజమైతే విజయసాయి రెడ్డి గారిని వైసిపి ప్రభుత్వం నుండి తొలగించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. కల్లబొల్లి మాటలతో నిరుద్యోగ యువత తో ఓట్లు వేయించుకొని. నిరుద్యోగ యువతను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు, ఒకసారి నిరుద్యోగ యువత కన్నెర్ర చేస్తే వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అనే విషయం జగన్ మోహన్ రెడ్డి గారు గ్రహించాలని ఇప్పటికైనా ఇంతకు ముందు వదిలిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే రద్దు చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గం మరొకసారి భేటీ అయి నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని, సరైన ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వదలాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్, అనిల్ , ఆంజనేయులు, నూర్ భాషా, అజయ్ కుమార్, రాజు, అశోక్ కుమార్, చాంద్ భాషా, జయరాముడు, రవికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way