కర్నూలు జిల్లా పత్తికొండ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సీఐ మంజుల గారిని కలిసి ఎస్ ఈ బి పరిధిలో కొనసాగుతున్న మద్యం నాటుసారా అక్రమ తయారీ అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిని వెంటనే అరికట్టాలని వినతి పత్రం అందజేసిన పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు C రాజశేఖర్. పత్తికొండ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి, పత్తికొండ తుగ్గలి, మద్దికేర, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నాటు సారా వ్యాపారం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు మరియు యువత నాటుసారకు బానిసలవుతున్నారు. కావున విక్రయాలు చేసేవారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు చాంద్ భాషా, ఇస్మాయిల్, నూర్ భాషా, తిమ్మప్ప, అంజి, అనిల్, నరేంద్ర, మరియు తదితరులు పాల్గొన్నారు.