
తెలంగాణ ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్ర నాయకుల సూచనలు మేరకు పటాన్ చెరువు నియోజకవర్గంలోని జనసేన పార్టీ బలోపేతానికి మరియు రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు గురించి కోఆర్డినేటర్ రాజేష్ యడమ అన్నయ్య గారి ఆధ్వర్యంలో చర్చి జరిగింది. పార్టీని ప్రజల వద్దకు బలంగా తీసుకువెళ్లడం కోసం రాజేష్ దిశానిర్దేశం చేశారు. ప్రతి జనసైనికుడు జనసేనపార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.