పాతపట్నం నియోజకవర్గంలో ‘ గిరి ‘ జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల సమస్యల తెలుసుకుంటున్న నియోజకవర్గ ఇంచార్జ్ ఇంచార్జ్ గేదెల చైతన్య గారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ౦ నుంచి ఎంతమంది ఎమ్మేల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యినా గిరిజన గ్రామాల సమస్యలు మాత్రం తీరడం లేదు. ప్రతి ప్రభుత్వం గిరిజనులనూ వెనక్కి నెట్టేస్తోంది. వీరికి సరైన నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, రోడ్ల సౌకర్యం, వైద్య సదుపాయం అందుబాటులో లేదు. వారి కోసం జనసేన పోరాటం చేస్తుందని, వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని అన్నారు. ప్రభుత్వం రేషన్ డెలివరీ అని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ తీరా రేషన్ కోసం డీలర్ షాపు దగ్గరకు తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. గిరిజనులు కొండ మీద ఉంటే కింది ప్రాంతానికి దాదాపు 6 కిలోమీటర్లు వచ్చి రేషన్ తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న పిల్లలు సైతం అన్ని కిలోమీటర్లు రేషన్ కోసం వెళ్తుంటే ఆ బాధ ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలయినంత త్వరలో గిరిజనులకు ఇంటి వద్దకే రేషన్ అందించాలని కోరుతున్నామని లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.