బిటెక్ రవి కు కౌంటర్ ఇచ్చిన జనసేన వీర మహిళ పసుపులేటి పద్మ
పులివెందుల టిడిపి MLC అయిన బిటెక్ రవి గారు మాట్లాడిన వ్యాఖ్యలకు , జనసేన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ, జనసేన వీరమహిళ పసుపులేటి పద్మ గారు కౌంటర్ ఇచ్చారు.
రాజధాని రైతులకి చెయ్యాల్సిన మోసం చేసి ఇప్పుడు మళ్ళీ కపట ప్రేమలు మొదలెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మీ నాయకుడు చంద్రబాబునాయుడు నీతో MLC పదవికి రాజీనామ చేయించి రాజకీయ క్రీడా మొదలుపెట్టారు అది తెలుసుకోలి. జనసేన అద్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు వేసిన ప్రశ్న రాజధాని ప్రాంతం లో ఉన్న వైసిపి ఎమ్మేల్యేలు, టిడిపి శాసన సభ్యులు అందరూ రాజీనామా చేసి రాజధాని అమరావతి రైతుల కోసం పోరాడమని చెప్పారు. నువ్వు చెప్పేది రాపాకతో పవన్ కళ్యాణ్ రాజీనామా చేయించండి ముందు అని అంటున్నావు ? నీకు ఏమాత్రం జ్ఞానం లేని నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. గతంలో రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు తీసుకున్న టిడిపి ప్రభుత్వం, అలాగే అమరావతి రాజధాని మార్చబోమని చెప్పి మాట మార్చిన వైసీపీ పార్టీ వారిని ప్రశ్నించక, ఆనాడు, నేడు అమరావతి ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ మీద నిందలు వేయడం సరి కాదు అని పద్మ గారు హెచ్చరించారు. ఎక్కడో పులివెందులలో సింహద్రిపురం మండలం లో కసనూరు గ్రామంలో ఉండే నువ్వు, ఆ రాజోలులో ఉండే ఎటుగాని రాపాక రాజీనామ చేస్తే రాజధాని సమస్య కి పరిష్కారం దొరకదు. మీకు మీ టిడిపికి, మీ చంద్రబాబుకి చిత్త శుద్ధి ఉంటే రాజధాని ప్రాంతంలో ఉన్న శాసన సభ్యులని రాజీనామా చేయించి రైతులకి అండగా నిలబడండి. అంతేకాని నీలాంటి MLC లు రాజీనామ చేస్తే ఏం ప్రయోజనం లేదు బిటెక్ రవి గారు. సబ్జెక్టు తో మాట్లాడు, అవగాహన రాహిత్యంతో మాట్లాడి ఉన్న పరువు పోగొట్టుకోకు అని పసుపులేటి పద్మ గారు హెచ్చరించారు.