Logo
Date of Publish : 17 October 2026, 5:59 pm
Editor : Sake Naresh

కోర్టు తీర్పు ప్రకారం పాస్ పుస్తకాలు ఇవ్వాలి – ఆర్డీవోకు ఫిర్యాదు

హుజూర్ నగర్, అక్టోబర్ 17 జనస్వరం, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో శనివారం ప్రజా కళాకారుడు బాదే నరసయ్య బాధితులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో 1982 నుండి నేటి వరకు పహానీలలో ఉండి, కబ్జాలో ఉంటూ పాస్ పుస్తకాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, మా హక్కు ప్రకారం పాస్ పుస్తకాలు ఇవ్వాలని 27 రోజుల నుండి గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని తెలిపారు.కోర్టు ఆర్డర్ ఉన్నా కావాలనే తహసీల్దార్ కిరికిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం భూమిని అమ్మడానికి, కొనడానికి వీలు లేదని జడ్జిమెంట్ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 1967లో జీవో జారీ చేసిందని, ఈ జీవో ప్రకారం లావుణి పట్టా భూమిని అమ్మినా, కొన్నా నేరమని తెలిపారు. చట్టం తమకు అనుకూలంగా ఉన్నా దానిని దుర్వినియోగం చేస్తున్నారని, విచారణ పేరుతో కాలయాపన చేస్తూ సంబంధం లేని వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పై అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, భద్రమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com