డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చాలని కోరుతున్న పార్వతీపురం జనసైనికులు
పార్వతీపురం డంపింగ్ యార్డ్ సమస్య తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం సబ్ కలెక్టర్ ని మరియు ఐటిడిఎ పిఓ గారిని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గం కార్యకర్తలు కలిసి వారికి వినతిపత్రం అందించారు. మా డిమాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం డంపింగ్ యార్డ్ ను వేరే చోట మార్చడం కాదు. వేరే చోట మార్చడం వల్ల అక్కడున్న ప్రజలు కూడా ఇబ్బంది పడతారు అలా కాకుండా ఇక్కడ ఉన్న చెత్తని "వేస్ట్ మేనేజ్మెంట్" ద్వారా రీసైక్లింగ్ చేసి తిరిగి మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోమని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.