Logo
Date of Publish : 18 April 2022, 3:31 pm
Editor : Sake Naresh

బస్సు ఛార్జీలను తగ్గించాలని ఆందోళన చేపట్టిన పార్వతీపురం జనసేనపార్టీ నాయకులు

     పార్వతీపురం, (జనస్వరం) : ప్రభుత్వం ఇటీవల డీజిల్ సెస్ పేరుతో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జనసైనికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు చందక అనిల్, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, బోనెల గోవిందమ్మ, పైల లక్ష్మీ, ఆగురు మణి, అంబటి బలరాం నాయుడు, మనేపల్లి ప్రవీణ్, పైల శ్రీను, బోనెల చంటి, ఆగూరు కేశవరావు, చిట్లీ గణేష్ తదితరులు ఆర్టీసీ డిపో వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు...జగన్ రెడ్డి బాదుడు...పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని... నినాదాలు చేశారు. తక్షణమే పెంచిన చార్జీలను తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే... బాదుడు అంటూ శోకాలు తీసేవారని, ఇప్పుడు ఆయన బాదుతున్న ధరల బాదుడు ఏంటని ప్రశ్నించారు. పేదవాడి ప్రయాణ సాధనమైన ఆర్టీసీ చార్జీలు పెంచి వారిపై భారం వేయడం సరికాదన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు పరిస్థితి దారుణమన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఏసి బస్సులో 2,5,10 రూపాయల చొప్పున పెంచి ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుదలతో పాటు కరెంటు, డీజిల్, పెట్రో ధరలు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని డిపో అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com