వినుకొండ, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం భారీ గా పెంచిన విద్యుత్ ధరలకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు జిల్లా కేంద్రాలలో నిరసనలు తెలియజేసారు. నిరసన కార్యక్రమానికి వినుకొండ నుంచి నిస్సంకర శ్రీనివాసరావు అధర్యం పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుంటూరు జనసేన పార్టీ ఆఫిస్ నుండి భారీ ర్యాలీ తో కలెక్టర్ ఆఫీసు వద్దకు చేరుకోని జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాస్, వినుకొండ నియోజకవర్గ నాయకులు అడపాల అనీల్, అసా మనోహర్, గండి కోట మణికంఠ, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com