జగ్గయ్యపేట పట్టణం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచనలతో జగ్గయ్యపేట పట్టణంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం, క్రియా వాలంటీర్లకు చిరు సత్కారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు భీమా చేయించిన గొప్ప పార్టీ జనసేన అని, కష్టపడి పని చేస్తూ పార్టీ కోసం కృషి చేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునే విధంగా కళ్యాణ్ వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల భీమా చెక్కు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇలాంటి పేదవారికి అండగా ఉండేందుకు కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ అతిథిగా పాల్గొని క్రియా శీలక కిట్లు కార్యకర్తలకు అందించారు. ఈ కార్యక్రమంలో రాం, త్రిశాంత్, సాయి, పాషా, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com