గుంటూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మక చేపట్టిన మూడో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ నుంచి దాదాపు 4000 సభ్యత్వాలు చేసి ప్రజలను పార్టీలో భాగస్వాములు చేసిన క్రియాశీలక వాలంటరీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా కష్టపడ్డ వారందరినీ ఘనంగా సత్కరించి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఈనెల 14న మచిలీపట్నంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, టౌన్ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, క్రియా వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com