Logo
Date of Publish : 03 September 2020, 11:19 am
Editor : Sake Naresh

జనసేనాని జన్మదిన సందర్భంగా ఆక్సిజన్ సిలెండరును అందించిన పరవాడపాలెం గ్రామ జనసైనికులు

జనసేనాని జన్మదిన సందర్భంగా ఆక్సిజన్ సిలెండరును అందించిన పరవాడపాలెం గ్రామ జనసైనికులు

విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం పరవాడపాలెం గ్రామంలో జనసేన యూత్ పరవాడపాలెం ఆధ్వర్యంలో గొంతిని ఈశ్వరరావు, పరవాడ పవన్ సందీప్, గ్రామ జనసైనికులు ఆర్థిక సాయంతో నార్మల్ ఆక్సిజన్ సిలిండర్ సెట్ ని పవన్ కళ్యాణ్ గారి  జన్మదిన సందర్భంగా  పరవాడపాలెం గ్రామంలో అత్యవసర ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రీ కోనేటి గోపి గారి సిబ్బందికి అందజేయడం జరిగింది.  జనసైనికులు మాట్లాడుతూ కరోనా కోరల్లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా అనేక మంది పౌరులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన దుర్ఘటన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనసును తీవ్రంగా కలిచివేసింది. జనసైనికులు అందరూ కూడా రాష్ట్రంలోని కోవిడ్  ఆసుపత్రులలో ఉన్నటువంటి  ఆక్సిజన్ సిలిండర్ కొరత విషయాన్ని గమనించి ఈ సంవత్సరం జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేశారు అన్నారు. అనుకున్నదే తడవుగా మా గ్రామం తరుపున ఆక్సిజన్ సిలెండర్ ఇవ్వడం జరిగింది అన్నారు. మేము చేసే ఈ చిరు సాయం కారణంగా ఎంతో విలువైనటువంటి ప్రజల ప్రాణాలు రక్షించబడడమే జనసేనానికి మేము అందించే పుట్టినరోజు కానుక అని అన్నారు. ఈ ఆక్సిజన్ యునిట్స్ ద్వారా  హాస్పిటల్ లో వైద్య సేవలు అందుకుంటున్న సామాన్య ప్రజానీకానికి మరిన్ని మెరుగైన సేవలు అందించబడతాయని సహృదయంతో ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తాడ రామరాజు, గొంతిని ఈశ్వరరావు, గుర్రాల సత్యారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com