రాజమండ్రి ( జనస్వరం ) : కరప మండలం ఉప్పలంక గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు సంగడి శ్రీను, మండల అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో ఉప్పలంక గ్రామంలో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి వెళ్ళి చేయు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కుమారుడు పంతం సందీప్ పాల్గొన్నారు. పంతం సందీప్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం కష్టపడదామన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోగిరెడ్డి గంగాధర్, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య మరియు తెలుగుదేశం నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి ఏసుదాసు, రాందేవు సీతయ్య దొర తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com