Logo
Date of Publish : 20 August 2022, 3:07 am
Editor : Sake Naresh

మందుబాబుల ఆగడాలకు మహిళలలో భయాందోళనలు : జనసేన నాయకురాలు దారం అనిత

     చిత్తూరు, (జనస్వరం) : రాష్ట్రంలో మందుబాబులు ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత పేర్కొన్నారు. బడి గుడి అనే భయం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మహిళలైతే ఒంటరిగా వెళ్లడానికి భయపడుతున్నారని, కొన్ని ప్రాంతాలు అయితే బార్లు తరహాలో దారులు నిలయంగా మారాయని వాపోయారు. ఈ మార్గాల్లో జనం రావడానికి భయపడుతూ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారని తెలిపారు. మద్యం తాగే వారి విచ్చల విడతనానికి అడ్డుకట్ట వేసేవారే లేకపోయారు. అన్నమయ్య వైయస్సార్ జిల్లాలో మందుబాబులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలలు మైదానాలు, మార్కెట్ యార్డులు బైపాస్ రోడ్లు ఖాళీ ప్రాంతాలను మందుబాబులు తమ అడ్డాగా చేసుకుంటున్నారని, దీనికి కారణం జనావాస ప్రాంతాలలో మద్యం షాపులు ఉండటమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది కానీ ప్రజా రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఇప్పటిదాకా అయినా స్పందించి ప్రజావాసాల మధ్య మద్యం షాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com