Logo
Date of Publish : 15 July 2026, 10:47 pm
Editor : Sake Naresh

రాష్ట్ర ముఖ్యమంత్రి,కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పర్యటన సందర్భంగా ఏఎస్ఎల్ నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా,ఇంచార్జి ఎస్పీ ఉమా మహేశ్వరరావు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి నరసరావుపేట పట్టణానికి విచ్చేయనున్న సందర్భంగా ఏఎస్ఎల్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ బి. ఉమామహేశ్వర్.

నరసరావుపేట,జూలై 15 ( జనస్వరం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 17.07.2026న రుణమేళా కార్యక్రమానికి విచ్చేయనున్న సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఇస్సపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, సమావేశం జరగనున్న కోడెల శివప్రసాదరావు స్టేడియాన్ని, వీఐపీ వాహనాలు, సభకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. 17.07.2026న జరగనున్న కార్యక్రమానికి సంబంధించి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, పర్యటన నిమిత్తం పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాల సహాయంతో భద్రతను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.

 

ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె వి సంతోష్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ కుమార్ చౌదరి, నరసరావుపేట డి ఎస్పీ హనుమంతరావు మరియు ఇతర పోలీస్ ఉన్నత అధికారులు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com