కర్నూలు నియోజకవర్గం డోన్ నియోజకవర్గం, బేతంచెర్ల మండలంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా కొలుములపల్లె గ్రామంలో డోన్ నియోజకవర్గ నాయకులు బాలు యాదవ్ గారు పర్యటించి గ్రామ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. బాలు యాదవ్ గారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజా సమస్యల ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. దీనిని "జనసేన పార్టీ" తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం, ప్రజా సమస్యలపై బలంగా పనిచేస్తుందని, పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే జనసైనీకులకు నియోజకవర్గ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల నాయకులు మద్దయ్యనాయుడు, పరమేష్, నవీన్ మరియు కొలుములపల్లె గ్రామ జనసైనికులు రామకృష్ణ, స్వాములు, చంద్ర, మధు, మనోహర్, రాజు, హరిష్, సురేష్, నారాయణ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com