పలాస ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు మజ్జి భాస్కరరావు ఆధ్వర్యంలో పలాస 1వార్డ్ నాయకులు వాడరేవు అశోక్, తామాడ రోజా రాము, దున్న రమేష్, బత్తిని ఈశ్వర్ సహకారంతో మన జనసేన పార్టీ జనసేన పార్టీ - మన గుర్తు గాజు గ్లాస్ (Tea With JanaSainiks) అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ను ప్రజల్లోకి తీసుకోని వెళ్లడం, యువతను నాయకత్వం వైపు నడిపించడం అని తెలియజేసారు. రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వం అని, మనమందరం కలిసి పనిచేసి పలాస నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థికి గెలిపించాలని తెలియజేసారు. జనసైనికులతో మాట్లాడి వార్డ్ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం సమన్వయకర్త దుర్గరావు, మందస మండలం అధ్యక్షులు కుప్పయి గోపాల్, మాజీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు కంచరాన అనిల్, పలాస మండలం నాయకులు పైల నాగార్జున, పైల ప్రదీప్, మున్సిపాలిటీ నాయకులు సంతోష్, అట్టాడ వాసు, మందస మండలం జనసేన నాయకులు తిరుపతి గౌడ,ఇంటెనుక ఆనందరావు, వజ్రపుకొత్తూరు నాయకులు శిస్టు శంకర్ మరియు మున్సిపాలిటీ జనసైనికులు బమ్మిడి శ్యామ్ దున్న లవన్, డి బాబి, జి చిట్టీ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com