పలాస ( జనస్వరం ) : పలాస నియోజకవర్గం పలాస మున్సిపాలిటీలోని రెండువ వార్డ్ లో టీ విత్ జనసైనిక్స్ అనే కార్యక్రమాన్ని మజ్జి భాస్కరరావు ఆధ్వర్యంలో 2వ వార్డ్ నాయకులు మార్పు హరీష్ గారి సహకారంతో నిర్వహించడం జరిగింది. 2024లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభ్యుత్వం ఏర్పాటు చేసేవిధంగా పలాస నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జనసైనికులు అందరూ కలిసి పనిచెయ్యాలని కోరారు. జనసైనికులు అందరూ అధినాయకుడు తీసుకొనే నిర్ణయానికి జనసైనికులు కట్టుబడి ముందుకు వెళ్ళాలని, గ్రామ, పంచాయతీ స్థాయిలో నాయకత్వన్ని బలపరచాలన్నారు. యువకులు నాయకత్వ లక్షణాలను పెంచుకుని యువ నాయకులుగా తయారవ్వాలని సూచించారు. యువత నాయకులుగా ఎదగడానికి జనసేనపార్టీ మంచి వేదికను కల్పిస్తుంది అని ఈ అవకాశాన్ని రాజకీయాలపట్ల ఆసక్తి ఉన్న యువత అందిపుచ్చుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు అట్టాడ వాసు, కోన కృష్ణారావు తమాడ రోజా రాము, వాడరేవు అశోక్, రామకృష్ణ వినోద్, బాబురావు, పలాస రూరల్ మండలం నాయకులు పైల నాగార్జున,సిస్తూ శంకర్ , పైల చిట్టిబాబు మందస మండలం జనసేన అధ్యక్షులు కుప్పయి గోపాల్,నాయకులు తిరుపతి గౌడ, రౌతు చిరంజీవి, తెలుగుదేశం నాయకులు ఇరోతు ధర్మారావు, కోల కళ్యాణ్, తడక జగదీష్, తమాడ జయకృష్ణ, రామారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com