గత కొన్ని రోజులుగా జీడి రైతులు, కార్మికులు, కౌలు రైతులు, రైతు కూలీల వ్యాపారస్తులతో కలుస్తూ వారి ఒక్క సమస్యలు సూచనలు తీసుకుంటూ జనసేన పార్టీ నాయకులు ఈ రోజు 18 పేజీలు జీడి పరిశ్రమ అభివృద్ధి రోడ్ మ్యాప్ తయారు చేసి మొదట కాపీ ఉద్దాన ప్రాంత రైతు తో మీడియా సమక్షం లో రిలీజ్ చేసారు. తర్వాత జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లతాకర్ కు మొదటి కాపీ అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ బాగోవడం అంటే పండించే రైతు నుంచి ప్రాసెసింగ్ చేసే వ్యాపారస్థులు మరియు కార్మికులు ప్రతి ఒక్కరు భాగమవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం ప్రాoతం వచ్చినప్పుడు ఇక్కడ క్యాషూ బోర్డు పెట్టాలి అన్న డిమాండ్ మొదటి అంశంగా చేర్చి, రెండవ అంశంగా పలాస కేంద్రంగ జీడి పరిశోధనా కేంద్రం, రైతులుకి దిగుబడి నిల్వ ఉంచడానికి వ్యవసాయ గొడౌన్స్, వ్యాపారస్థుల మార్కెట్ పెంపొందించుటకు కేంద్రం నుంచి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ బ్రాంచ్ పలాస లో స్థాపించాలి అని అన్నారు. చిన్న కారు/ రైతు కార్మికులుకు ప్రభుత్వ భూమిలో జీడి సాగు చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం మోడల్ క్యాషూ ఫ్యాక్టరీస్ స్థాపన వంటివి ప్రాధమిక డిమాండ్లుగా మరియు ఇన్పుట్ సబ్సిడీ, పంట పెట్టుబడి రుణాలు, క్యాషూ సీడింగ్, ఇంటెర్క్రోప్పింగ్, ఉచిత పెస్టిసైడ్స్, కార్మికుల ఈ.స్.ఐ, పి.ఫ్, స్కిల్ ట్రైనింగ్ మరిన్ని అంశాలు ద్వితీయ డిమాండ్లుగా చెర్చారు. ధర స్థిరత్వం, గ్రేడింగ్ సామర్థ్యం, సేంద్రియ వ్యవసాయం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు, అధిక రాబడి వచ్చే మార్గాల పై అధ్యయాలు చేయాలి అని అన్నారు. జీడి పిక్క మద్దతు ధర సమస్యలకు క్యాషూ బోర్డు లేదా అహ్ ప్రమాణాల తో పెట్టె ప్రభుత్వ సంస్థే శాశ్వత పరిస్కారం అని అప్పటి వరకు ప్రభుత్వ మార్కెటింగ్ సేఖా ద్వారా కొనుగోలు చేయాలి. ప్రస్తుతం వున్న పిక్కకి కనీసం ధర 13000 ప్రభుత్వం ఇవ్వాలి అని, తితిలి తుఫాను తరువాత దిగుబడి భారీగా తగ్గింది అని అన్నారు. పసుపు రైతులకి ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చిన బోనస్ విధంగా జీడి రైతులకి దిగుబడి పెరిగే వరకు కనీసం 5 సంవత్సరాలు పటు బోనస్ ఇవ్వాలి అని అయిన ఈ సందర్భంగా అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com