
పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం, పెద్ద కోటిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఉమా కాత్యాయని సహిత విశ్వేశ్వర స్వామి 54వ వార్షిక మహోత్సవాల సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహాత్సవాలు సందర్భంగా, ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత త్రాగునీరు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, శానిటైసషన్ మరియు మాస్కులు పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద కోటిపల్లి, LL పురం, భాసూరు, రాజపేట, అర్థలి, పథ్మపురం జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.