
పాలకొల్లు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంలో జ సైనికులు, నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్లకుండా హోటల్లో నిర్బంధానికి గురి చేయడం ప్రభుత్వ వైఖరికి పోలీసుల వైఖరికి నిరసనగా పాలకొల్లు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ఆటంకాలు కలిగించిన ప్రభుత్వ నిరంకుశ వైఖరి సరైనది కాదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించే కార్యక్రమాలకు ఆటంకాలు సృష్టించడం తగదని త్వరలోనే దీని యొక్క మూల్యం ఎన్నికల్లో చూస్తారని పేర్కొన్నారు. జనసేన బలం రోజురోజుకీ పెరగడం ప్రభుత్వం తట్టుకోలేక పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, పాలకొల్లు పట్టణ, మండల, యలమంచిలి మండలం, పోడూరు మండల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.