Logo
Date of Publish : 25 August 2020, 3:05 pm
Editor : Sake Naresh

వరద ముంపు గ్రామంలో పర్యటించిన పాలకొల్లు జనసేన ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు

వరద ముంపు గ్రామంలో పర్యటించిన పాలకొల్లు జనసేన ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు

              యలమంచిలి మండలం వరద ముంపు గ్రామమైన ఏనుగువానిలంక బాడవ గ్రామంలో నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు గారు పర్యటించారు. ఈ సంధర్బంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ నీళ్లు ఎప్పుడో మనిషికి 5 పాకెట్ లు ఇచ్చారని, మళ్ళీ మా వైపు చూసినోడు లేరని, భోజనాలు కావాలంటే స్కూల్ దగ్గరకి రమ్మంటున్నారని, పీకల్లోతు నీటిలో పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తే, వస్తే రండి లేకపోతే పోండి అని నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతున్నారని వాపోయారు. ఈ బాధలు నాగబాబు గారు వెంటనే మండల తహసీల్ధారుకీ ఫోన్ చేసి ఫోన్లో ప్రజల బాధలని వివరించి సత్వరమే ప్రజల అవసరాలను తీర్చాలని ఆదేశించారు.. వెంటనే గ్రామ సెక్రటరీతో మాట్లాదామని వెళ్తే ఆయన ఇంకా డ్యూటీకీ రాలేదని తెలిసి ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ ప్రతి సంవంత్సరం వచ్చే వరదలను కట్టడి చెయ్యటంలోను, వరదలో ప్రజలని ఆదుకోవటంలోను ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలపమైందని, కేవలం ఓట్లే రాజకీయాలుగా చూస్తూ అధికార పార్టీ ఇలాంటి విపత్కర పరిస్థితిలోను రాజకీయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా గత నాలుగు రోజులుగా ప్రభుత్వం పట్టించుకోకపోయినా జనసైనికులు సొంత డబ్బుతో గ్రామానికి రోజూ వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారని తెలిసి వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాల అధ్యక్షులు కొడవటి వరబాబు, విప్పర్తి ప్రభాకర్, గుత్తుల నాగరాజు, నాయకులు కొమ్ముల ప్రతాప్, దేవా ప్రసాద్, అబ్దుల్ మీరా వలి షేక్, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, ఇంటి బాబురావు, పాటబళ్ల బాలాజీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com