పాలకొల్లు ( జనస్వరం ) : ఈరోజు పాలకొల్లు పట్టణ ఎనిమిదో వార్డులో జరిగిన సంఘటనకు పాలకొల్లు పట్టణ జనసేన వెంటనే స్పందించింది. ఈరోజు స్కూలు పిల్లలను తీసుకువెళుతున్న భారతీయ విద్యా భవన్ స్కూల్ బస్సు ఎనిమిదో వార్డు నుంచి బైపాస్ రోడ్డుకి చేరుకునే మార్గంలో సరైన రోడ్డు మార్గం లేకపోవడం తోవ్విన కచ్చా డ్రైన్ వలన స్కూలు బస్సు ఒక పక్కకు ఒరిగిపోయి త్రుటిలో ప్రమాదం తప్పింది. బస్సులో విద్యార్థులు కు పెనుప్రమాదం తప్పింది. ఉన్న పిల్లలందరూ కూడా భయభ్రాంతులకు గురైయ్యారు. ఈ రోడ్డు ను వెంటనే బాగుచేయ్యక పోతే జనసేన నాయకులు అందరూ ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికుల సహకారముతో శ్రమధానంచేస్తామన్నారు. ప్రాంతాన్ని పరిశీలించి ఒక సంవత్సరం క్రితం శాంక్షన్ అయిన రోడ్డుని ఇంత వరకు ఎందుకు పూర్తి చేయలేదు. ఈ రోడ్లు ఇంత ఆధ్వనంగా ఉండటం వలన సుమారు 10 పాఠశాలలు, కళాశాలాలకు వెళ్లే విధార్ధినీ, విద్యార్దులు జారిపాడిపోతున్నారు. ఈ రోడ్డు చాలా అద్వాన్నంగా ఉంది దీనిని వెంటనే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగకుండా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలనీ కోరుతున్నాము. లేదంటే జనసైనికులు స్వచందంగా స్థానిక ప్రజలతో కలిసి శ్రమాధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు సిడగం సురేంద్ర సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి కొమ్ముల దినేష్ ఉపాధ్యక్షులు పినిశెట్టి శ్రీనివాస్ విన్నకోట గోపి, తులా రామలింగేశ్వరరావు, యాళ్ల రవీంద్ర, బిట్ట లక్ష్మీనారాయణ, ఆచంట రామకృష్ణ, బొద్దని శిరీష్, అలుగు సత్తిబాబు, మద్దాల వెంకట్,మిడిమించి చిన్ని, చెన్ను మనోజ్, లంక సాయి, తంగెళ్ళ సత్తిపండు, పోకల సాయి తదితరులు పాల్గొన్నారు.