కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని Tసుండుపల్లిమండలం పెద్దబలిజపల్లి గ్రామ ప్రజలు అవసరాల కోసం డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలని గ్రామస్థుల తరపున జనసేనపార్టీ ద్వారా వినతిపత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో జనసేన నాయకులు అందించారు. జనసేన నాయకులు రామ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు తమ ఇళ్లల్లోంచి నుంచి అనవసర నీరు మరియు వర్షపు నీరు రైతుల పంట పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తుల కోసం మరొక డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో చెత్త ఎక్కువ ఉండడం వల్ల మురికి నీరు ఎక్కువగా ఉండిపోయి చెత్త మరింత దుర్వాసన వస్తోంది. దగ్గరలోనే ప్రజల నివాసం ఉండటం వల్ల ఆ చెత్త దుర్వాసనను భరించలేకున్నారు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. చిన్న పిల్లలకు కూడా జ్వరాలు, వాంతులు వచ్చి అనారోగ్యపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్థులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.