
విశాఖపట్నం ( జనస్వరం ) : సబ్బవరం మండలం దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి వెద్దుల నరవ, ఈ గంగవరం, అజనగిరి గ్రామాలకు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని అజనగిరి నుండి కొత్తూరు వేద్ధుల నరవ వరకు పాదయాత్ర చేసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్థానిక నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు సోషల్ మీడియా లో మాట్లాడుతూ 7 రోజుల్లో శంకుస్థాపన చేస్తాను అని చెప్పి 3 సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు రోడ్డు పనులు ప్రారంభించలేదని, ఈరోజు చాలా దురదృష్టకరం దినంగా భావించవచ్చని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పరిపాలనలో రోడ్లు లేకపోవడం వల్ల ఈ రహదారిలో సుమారు ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి వాహనదారులుకు దెబ్బలు తగులుతున్నాయని అన్నారు. ఈ రోడ్డు సుమారు చోడవరం, సబ్బవరం మండలం ప్రజలకు రైల్వే స్టేషన్ కు గాజువాక వెళ్లడానికి ప్రధానమైన రహదారని ఇటువంటి రోడ్డును చిన్నచూపు చూడడం మీ యొక్క పరిపాలన దక్షతకు నిదర్శనం అని, ఒక నెల రోజులో రోడ్డు పనులు మొదలు పెట్టకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరమ్మత్తులు చేసి ప్రజలకి రోడ్లు అందుబాటులో తీసుకుని వచ్చిన తర్వాత జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ నిధులతో ఈ రోడ్డును మరింత బాగు చేస్తామని అన్నారు. స్థానిక కార్పొరేటర్ మల్లు ముత్యాల నాయుడు బాధ్యత తీసుకొని మీ సొంత గ్రామం అయిన వేద్దుల నరవ ప్రజలకు, మీ పరిసర గ్రామ ప్రజలకు సురక్షితమైన రోడ్డును అందుబాటులోకి తీసుకోనిరావాలని, మీ ఇంటి ముందే చాలా పెద్ద గొయ్యి ఉన్న ఇప్పటివరకు ఎటువంటి మరమత్తు పనులు చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. మీరు సామాన్యుడిలాగా పేపర్లు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారని మీయొక్క బాధ్యతను మర్చిపోవడాన్ని ప్రజలు తప్పకుండా మిమ్మల్ని గమనిస్తున్నారని, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు దుబాయ్ రాజ్, గంగవరం రాజు,గోపి, ప్రసాద్, అప్పారావు, రమణ, వరహాలు, కృష్ణ, నాగరాజు, బొడ్డు నాయుడు, గవర శ్రీను, జన సైనికులు ప్రజలు పాల్గొన్నారు.