పొదిలి ( జనస్వరం ) : చీమకుర్తి మండలంలోని కూనం నేనివారిపాలెంలో మే 14 – 2022 తేదీన ఆంజనేయ స్వామి తిరునాళ్ళ రోజు మిస్సైన పొదిలి గోపీ(19)సం !! 2 నెలలు తర్వాత శవమై తేలిన విషయం విధితమే. అయితే మృతుడు గోపీ గజ ఈతగాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని జనసేన నేతలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు. కాగా గోపి మృతి చెంది ఇన్ని రోజులు గడుస్తున్నా, పోస్టుమార్టం రిపోర్ట్ లు కూడా ఇవ్వకుండా పోలీసులు ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని. శుక్రవారం కేవీ పాలెం నుంచి ఒంగోలు కలెక్టరేట్ వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకి చీమకుర్తి మండల జనసేన పార్టీ మద్దతు తెలపగా స్థానిక కేవీ పాలెం బైపాస్ దగ్గర నుంచి అయ్యప్ప స్వామి గుడి వరకు పాదయాత్రలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పల్లపు ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గోపి మృతి పట్ల ఇంతా నిర్లక్ష్యంగా పోలీస్ లు వ్యవహరించడం తగదు అని హెచ్చరించారు. అగ్రకులాలకు చెందిన వ్యక్తి మృతి చెందితే ఇంత నిర్లక్ష్యంగానే పోలీసులు వ్యవహరిస్తారా అన్ని ప్రశ్నించారు. గోపికి న్యాయం జరిగే వరకూ వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముందుగా స్థానిక బస్టాండ్ సెంటర్ లో ప్రజా సంఘ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ గోపి హత్యకు గల కారణాలను వెలికి తీయాలి, సీబీసీఐడీ చేత ఎంక్వయిరీ చేయించాలి, హంతకులను పట్టుకొని శిక్షించాలి ,పోలీసులు గోపి కేసు పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు అని రోడ్లపై బైఠాయించి డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు పూలే విగ్రహానికి పోలీసులు కళ్ళు తెరిపించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలి అని విగ్రహానికి అర్జీ కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుడు గోపి తల్లి నాగమణి, మాల్యాద్రి,రజిక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కొండయ్య, కోటేశ్వరరావు, రవణమ్మ, బీసీ సంక్షేమ సంఘం దోమల పుల్లయ్య, కెవిపిఎస్ నాయకులు రామారావు, ప్రజా మార్చమండలి సురేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పల్లపు శివప్రసాద్, నాయకులు ముత్యాల సురేష్, సుంకర మురళి, వెన్నుకోట కృష్ణ,ధర్నాసి చందు, కణాల మారుతి, మహేష్,శామ్యూల్, ఎస్.కె సాదిక్, పల్లపు పూర్ణ,చల్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.