Logo
Date of Publish : 25 January 2026, 9:05 pm
Editor : Sake Naresh

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్‌గా పి.రామాంజనేయప్రసాద్ నియామకం

అనంతపురము, జనవరి 25, (జనస్వరం) : దళిత వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న పి. రామాంజనేయప్రసాద్‌కు మరో కీలక బాధ్యత లభించింది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్‌గా ఆయనను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ సిద్ధాంతాలకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై స్పష్టమైన వైఖరి, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌తో గుర్తింపు పొందిన రామాంజనేయప్రసాద్ సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రామాంజనేయప్రసాద్ మాట్లాడుతూ తనపై రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవానంద్, రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు కొనగొండ్ల రాజేష్ సహా తనపై నమ్మకం ఉంచిన పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను గౌరవంగా మాత్రమే కాకుండా సేవా అవకాశంగా భావించి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సామాన్య ప్రజల సేవలో, పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక న్యాయం, దళిత వర్గాల సాధికారత పథకాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com