హైదరాబాద్, జూలై 25 (జనస్వరం): మెగా కుటుంబం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మెగా యూత్ ఫోర్స్ కమిటీ రాయలసీమ కన్వీనర్‌గా పి. చక్రవర్తిని నియమించారు. ఈ మేరకు మెగా యూత్ ఫోర్స్ గౌరవ అధ్యక్షురాలు కొణిదెల సుస్మిత నియామక పత్రాన్ని జారీ చేశారు. ఈ నియామకం 2026 జూలై 25 నుంచి 2027 జూలై 24 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొణిదెల సుస్మిత మాట్లాడుతూ, మెగా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సినిమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మెగా అభిమానుల సేవా భావం అభినందనీయమని అన్నారు. మెగా కుటుంబం పట్ల పి. చక్రవర్తి చూపుతున్న అంకితభావం, సామాజిక సేవలో ఆయన నిబద్ధత, అభిమానులను ఏకతాటిపై నడిపించే నాయకత్వ లక్షణాలను గుర్తించి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు రాయలసీమ కన్వీనర్‌గా నియమించినట్లు తెలిపారు. ఈ బాధ్యతలో భాగంగా రాయలసీమ వ్యాప్తంగా మెగా అభిమానులను సమన్వయం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, మెగా హీరోల సేవా స్ఫూర్తి, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. మెగా కుటుంబానికి మరింత మంచి పేరు తీసుకురావడంతో పాటు సమాజంలో మెగా అభిమానుల గౌరవాన్ని, ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచిస్తూ పి. చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.