- సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి..
- ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి...
- క్లాప్ డ్రైవర్లకు బకాయి ఉన్న 6 నెలల వేతనం ఇవ్వాలి...
- నగర విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి...
- బకాయి ఉన్న డిఏలు ఇంక్రిమెంట్ లు ఇవ్వాలి....
- జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్
అనంతపురము ( జనస్వరం ) : నగరంలోని స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికుల సమ్మె మూడో రోజు చేపట్టారు. కార్మికుల సమ్మెకు జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావ, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా అధికార ప్రతినిధి మురళి లు జనసేన పార్టీ తరపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ మీడియా వారితో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మల మూత్రాలు శుభ్రపరచి రోడ్లను కాలువలను మరియు నగరం శుభ్రంగా ఉంచి కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంతో పని చేశారు. అలాంటి పారిశుద్ధ కార్మికులు నేడు రోడ్లు ఎక్కారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జరగబోవు జాయింట్ చర్చల్లోనైనా శాఖ మంత్రులు కార్మికుల యోగక్షేమలు, చూడాలని కోరారు మున్సిపల్ పర్మిట్ అండ్ కాంట్రాక్ట్ పబ్లిక్ నాన్ పబ్లిక్ క్లాప్ ఆటో డ్రైవర్ల డిమాండ్లను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం లేక కేంద్రం ఆశించినట్లు కనీస వేతనం రూ. 26,000/- రిటైర్డ్ కాలానికి బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నటువంటి అన్ని అలవెన్స్ వర్కర్స్ కు ఇవ్వాలని. సీనియార్టీ లేకుండా పారిశుద్ధ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని. క్లాప్ ఆటోలకు రూ. 18,500/- జీతాలు నెలసరి జీతాలు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మునిసిపల్ మహిళా కార్మికులు టి.సి.వరుణ్ గారి దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్లాలని వారు కోరారు. ఖచ్చితంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com